- ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 39 గ్రామాలు ఏకగ్రీవం
- నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తేలిన లెక్క
- మొదటి విడతలో ప్రచారానికి దిగిన ముఖ్య నేతలు
- పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల రెండో విడత బరిలో 887 మంది అభ్యర్థులు నిలిచారు. 39 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ప్రచారం స్పీడ్ అందుకుంది. పోలింగ్ కు మూడ్రోజులు మాత్రమే సమయం ఉండడం, రేపటితో ప్రచారానికి గడువు ఉండడంతో అభ్యర్థులకు మద్దతుగా ముఖ్య నేతలు కూడా ప్రచారంలోకి దిగారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ క్యాండిడేట్లకు సపోర్టుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మూడ్రోజులుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ క్యాంపెయిన్ చేస్తున్నారు.
- ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల విత్ డ్రా తర్వాత మొత్తం 23 గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో 19 గ్రామాల్లో సర్పంచ్ తో పాటు పూర్తిగా వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో నాలుగు గ్రామాల్లో సర్పంచ్ తో పాటు కొన్ని వార్డులు ఏకగ్రీవం కాగా, ఇంకొన్ని వార్డుల్లో మాత్రం ఏకగ్రీవం కాకపోవడంతో పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే 183 గ్రామాలకు గాను 1,055 నామినేషన్లు దాఖలు కాగా, 353 మంది విత్ డ్రా చేసుకున్నారు. ఈ విడతలో 23 మంది గ్రామ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 160 గ్రామాల్లో సర్పంచ్ కోసం 441 మంది పోటీలో ఉన్నారు. రెండో విడతలో 1,686 వార్డులకు గాను 4,160 నామినేషన్లు దాఖలు కాగా, శనివారం 697 మంది విత్ డ్రా చేసుకున్నారు. 306 వార్డుల్లో ఒకే అభ్యర్థి పోటీలో ఉండడంతో ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,380 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, వీటిలో 3,227 మంది బరిలో నిలిచారు.
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పంచాయతీ ఎన్నికల రెండో విడతలో ఏడు మండలాల్లోని 155 పంచాయతీల్లో 386 మంది పోటీలో నిలిచారు. కాగా, పాల్వంచ మండలంలోని ఒక పంచాయతీకి సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. 16 సర్పంచ్ స్థానాలు, 248 , వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో ఏడు మండలాల్లోని 1,384 వార్డులకు గానూ 13 వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదు. 248 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2,820 మంది బరిలో నిలిచారు. 534 మంది విత్ డ్రా చేసుకున్నారు.
ఏకగ్రీవమైన గ్రామాలు.. సర్పంచులు
- ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలంలో జోగ్గూడెంలో భూక్యా సైదమ్మ, కెప్టెన్ బంజరలో ఆరెం అచ్చమ్మ, జగన్నాథపురంలో బానోత్ దీను, లాల్యాతండాలో మాలోతు సౌజన్య, పాతలింగాలలో కిన్నెర సుజాత, ఊటుకూరులో ఈసం హనుమంతరావు, ఖమ్మం రూరల్ మండలంలోని దారేడులో బత్తుల వెంకటేశ్వర్లు, పల్లెగూడెంలో చుండూరి సృజన, ముదిగొండ మండలంలో వల్లభిలో బిచ్చాల బిక్షం, నేలకొండపల్లి మండలంలో ఆచార్లగూడెంలో కొలికపంగు ఉప్పలమ్మ అజయ్ తండాలో తేజావత్ శివాజీ, కట్టుకాచారంలో భానావతు సైదులు, కూసుమంచి మండలంలో ని చంద్యాతండాలో బానోత్ బొంగ నాయక్, లాల్ సింగ్ తండాలో భూక్యా సావిత్రి, కొత్తూరు లోడిగలో నీలకంఠం, హీరామన్ తండాలో అజ్మీరా ఆమని, కోక్యాతండాలో హలావత్ వీరయ్య, పాలేరులో బానోత్ నాగేశ్వరరావు, తిరుమలాయపాలెం మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో మూడ్ వెంకన్న, హైదర్సాయిపేటలో బానోత్ చీమ్లా, ఎర్రగడ్డలో నల్లమల్ల కీర్తి, తిమ్మక్కపేటలో రేపాకుల సుభద్ర, హస్నాబాద్ లో కొవ్వూరి పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలో గుంపెనలో దారబోయిన నర్సమ్మ, వూటుపల్లిలో వి. వెంకటేశ్వర్లు, మద్దికొండలో తాటి రామకృష్ణ అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెంలో మడకం నాగేశ్వరరావు, చంద్రుగొండ మండలంలోని బొర్రా లలిత, మంగయ్య బజార్ఎం. గోపాలకృష్ణ, చుంచుపల్లి మండంలోని విద్యానగర్ కాలనీలో భూక్యా శాంతి శ్రీ, ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లిలో మడకం రవి, పాల్వంచ మండంలోని సంగంలో భానోత్ రవి, బిక్కుతండాలో భూక్యా ఝాన్సీ, ఇల్లెందులపాడుతండాలో తేజావత్, తవిసలగూడెంలో జి. రమేష్, దమ్మపేట మండలంలోని ఆల్లిపల్లి జమ్ముల రమేశ్, మొద్దులగూడెంలో బేతం రుక్మిణి, పూసుకుంటలో యట్ల రాజురెడ్డి, తాటి సుబ్బన్నగూడెంలో సవలం స్వాతి ఏకగ్రీవమయ్యారు.
ఖమ్మం జిల్లాలో రెండో విడత వివరాలు..
మండలం పంచాయతీలు ఏకగ్రీవం బరిలో.. వార్డులు ఏకగ్రీవం బరిలో..
కామేపల్లి 24 6 54 218 67 425
ఖమ్మం రూరల్ 21 2 49 202 22 393
కూసుమంచి 41 6 94 364 87 680
ముదిగొండ 25 1 72 246 27 512
నేలకొండపల్లి 32 3 72 300 50 528
తిరుమలాయపాలెం 40 5 100 356 53 689
మొత్తం 183 23 441 1686 306 3227
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వివరాలు..
మండలం పంచాయతీలు ఏకగ్రీవం బరిలో వార్డులు ఏకగ్రీవం బరిలో..
అన్నపురెడ్డిపల్లి 10 02 24 98 19 182
అశ్వారావుపేట 27 02 66 234 42 459
చంద్రుగొండ 14 02 33 134 26 237
చుంచుపల్లి 18 01 52 168 09 420
దమ్మపేట 31 04 76 290 56 556
ములకలపల్లి 19 01 69 173 34 402
పాల్వంచ 36 04 66 282 62 564
మొత్తం 155 16 386 1384 248 2820
