
హైదరాబాద్ సిటీ: కొండపల్లి డెయిరీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.9 కోట్లకు పైగా వసూలు చేసిన ఇద్దరిని సైబరాబాద్ కమిషనరేట్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ అరెస్ట్ చేశారు. రన్నింగ్ఫామ్లో పెట్టుబడులు పెట్టాలని 41 మందిని మోసం చేసినట్లు గుర్తించారు. కోకాపేటకు చెందిన మేముల సుబ్బారావు, వేముల కుమారి ఈ ఫ్రాడ్‌కు తెరతీశారు. ఇందుకోసం 2022లో తెలుగు, ఇంగ్లీశ్న్యూస్ పేపర్‌ల్లో “బిజినెస్ ఆఫర్” పేరుతో యాడ్లు ఇచ్చారు.
మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడలో ఉన్న డెయిరీ ఫాం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నదని, దీనికి మరింత ఇన్వెస్టర్లు అవసరమని, 16 సంవత్సరాలుగా నెలకు 2–3 లక్షల ఇన్కమ్ ఉంటుందని పేర్కొన్నారు. నమ్మినవారు యాడ్‌లోని ఫోన్‌నంబర్‌కు కాల్చేసేవారు. ఇన్వెస్టర్లకు ఫాంను, పశువులను , పాల ప్రాసెసింగ్ యూనిట్ మెషీన్‌ను చూపించేవారు.
అలా చాలా మంది పెట్టుబడులు పెట్టారు. తర్వాత ఎలాంటి లాభాలు పొందకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి, కుట్రను భగ్నం చేశారు. నిందితులు ఇద్దరూ రూ.9 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది.