రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

రాజస్థాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం భిల్వారా సమీపంలోని బిగోడ్ ప్రాంతలో జరిగింది.  భిల్వారాకు చెందిన జగదీష్ త్రివేది తన కుమారుడి మ్యారేజ్ తర్వాత తిరుగు ప్రయాణంలో ఉండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. మృతులలో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.