కార్తీక దీపం వెలగించడానికి వెళ్లి.. కుటుంబంలో 9 మంది గల్లంతు

కార్తీక దీపం వెలగించడానికి వెళ్లి.. కుటుంబంలో 9 మంది గల్లంతు

ఏపీని భారీ వర్షాలు వరద ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వందకు పైగా మంది వరద నీటిలో గల్లంతయ్యారు. తాజాగా కడప జిల్లాలో భారీ వరదలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపాయి. కార్తీక దీపం వెలిగించడానికి శివాలయానికి వెళ్లి ఒకే కుటుంబంలో 9 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన కడప జిల్లా పొలపత్తూరు శివాలయంలో చోటు చేసుకుంది. పుణ్యం కోసం కార్తీక దీపం వెలిగిద్దామని పూజారి కుటుంబం ఆలయానికి వెళ్లింది. ఆలయం కొండపై ఉన్న వరద ముప్పు తప్పలేదు. ఆలయాన్ని కూడా వరద ముంచెత్తడంతో అక్కడ ఉన్న 9 మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యం అయ్యింది. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో గుడికి వెళ్లారు. కొంచెం వర్షం పడుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా వరద ముంచెత్తింది. గల్లంతైన వారిలో పూజారి ఇద్దరు కోడళ్లు, ఆమె పిల్లలు ఉన్నారు.