తెలంగాణకు 9 మంది కొత్త ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

తెలంగాణకు 9 మంది కొత్త ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ రెగ్యులర్ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ బ్యాచ్‌‌‌‌‌‌‌‌ శిక్షణ పూర్తి చేసుకుంది.155 మంది ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లు, 20 మంది ఫారిన్‌‌‌‌‌‌‌‌ పోలీస్ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్ పొందారు. ఈ బ్యాచ్‌‌‌‌‌‌‌‌ పాసింగ్‌‌‌‌‌‌‌‌ అవుట్‌‌‌‌‌‌‌‌ పరేడ్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం జరగనుంది. ఈ పరేడ్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పరేడ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివరాలను అకాడమీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమిత్‌‌‌‌‌‌‌‌ గార్గ్‌‌‌‌‌‌‌‌ బుధవారం వెల్లడించారు. గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 45 వారాల పాటు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఫేజ్, 29 వారాల పాటు డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించామని చెప్పారు.187 మంది ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లు అకాడమీలో రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేయగా12 మంది ఐఏఎస్‌‌‌‌‌‌‌‌కు ఎంపికై వెళ్లి పోయారని చెప్పారు. వీరిలో 155 మందికి నాణ్య మైన శిక్షణ ఇచ్చామని తెలిపారు. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రతిభ కనబరిచిన ఏడుగురికి ట్రోఫీలు అందించనున్నట్లు తెలిపారు.

విలువలతో కూడిన శిక్షణ

పోలీస్‌‌‌‌‌‌‌‌ ప్రవర్తన, నైతిక విలువలు, మానవహక్కులకు సంబంధించిన నిపుణులతో ప్రత్యేక తరగతులు ఇప్పించామని అకాడమీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమిత్‌‌‌‌‌‌‌‌ గార్గ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సైబర్ క్రైమ్, వైట్ కాలర్ అఫెన్సెస్‌‌‌‌‌‌‌‌తో పాటు చిన్నారులపై లైంగిక దాడులను నివారించేందుకు  పోక్సో చట్టం అమలుపై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లో వివరించామని తెలిపారు. ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లకు ఎదురయ్యే సవాళ్లతో పాటు వాటిని అధిగమించేలా ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. కాగా శిక్షణ పూర్తి చేసుకున్న 155 మందిలో రాష్ట్ర కేడర్​కు 9 మందిని కేటాయించారు. తెలంగాణకు చెందిన నలుగురిలో ఇద్దరు మహిళా ఐపీఎస్​లు కూడా ఉన్నారు.

నిబద్ధతతో పనిచేస్త..


‘‘మాది మేడ్చల్ జిల్లా నాచారంలోని రాఘవేంద్ర కాలనీ. నాన్న ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ ఏజెంట్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. బీటెక్‌‌‌‌‌‌‌‌ చదివాను. ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ కావాలనే కోరికతో సివిల్స్ రాశా. సెకండ్ అటెమ్ట్‌‌‌‌‌‌‌‌లో 218వ ర్యాంకు వచ్చింది. డ్యూటీలో నిబద్ధతతో పనిచేసి, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్త’’
‑ కంకణాల రాహుల్ రెడ్డి, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌

అన్ని రకాల శిక్షణ..


‘‘మాది వరంగల్‌‌‌‌‌‌‌‌. నాన్న గ్రూప్‌‌‌‌‌‌‌‌ 2 ఆఫీసర్‌‌‌‌‌‌‌‌. వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఐటీలో బీటెక్ చేశా. తరువాత ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఐదేండ్లు ఏఈగా పనిచేశాను. సివిల్స్ రాసి ర్యాంకు సాధించాను. అన్ని రకాల శిక్షణ పూర్తి చేసుకొని డ్యూటీకి సిద్ధమయ్యాను’‑ బొక్క చైతన్యరెడ్డి, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ 

నాన్న ప్రోత్సాహంతో సివిల్స్..


‘‘మేము అల్వాల్‌‌‌‌‌‌‌‌లో ఉంటాం. నాన్న రిటైర్డ్ జడ్జి రాధాకృష్ణ. సివిల్స్‌‌‌‌‌‌‌‌కు ముందు బెంగళూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోవా ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశాను. నాన్న ప్రోత్సాహంతో సివిల్స్ రాశాను. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్త’’ ‑ ఎస్‌‌‌‌‌‌‌‌ చిత్తరంజన్‌‌‌‌‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌