భద్రాద్రికొత్తగూడెం జిల్లా నీటి ప్రాజెక్టుల భూ సర్వేల కోసం ఏడు స్పెషల్ టీంలు..

భద్రాద్రికొత్తగూడెం జిల్లా నీటి ప్రాజెక్టుల భూ సర్వేల కోసం ఏడు స్పెషల్ టీంలు..

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల భూ సర్వేల కోసం ఏడు స్పెషల్​ టీంలను ఏర్పాటు చేసినట్టు భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి పలు శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. దాదాపు 3వేల ఎకరాల భూమి సర్వేను రెండు నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నామన్నారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం వన మహోత్సవం, సీజనల్​ వ్యాధులు, పరిశుభ్రత, సర్కారు బడుల పర్యవేక్షణపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. కాగా, జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ జె.శ్రీనివాసరావును కలెక్టర్​ మర్యాదపూర్వకంగా కలిశారు.