నదిలో పడ్డ కారు .. 9 మంది మృతి

నదిలో పడ్డ కారు .. 9 మంది  మృతి

రాజస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. కోటాలోని చోటి పులియా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తుండగా కారు అదుపు తప్పి నదిలో పడినట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు పోలీసులు. మృతుల్లో పెళ్లి కొడుకుతో పాటు... కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. వీరందరి డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.