వీధి కుక్కల దాడిలో 9 గొర్రెలు మృతి

వీధి కుక్కల దాడిలో 9 గొర్రెలు మృతి

దండేపల్లి, వెలుగు :  దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామపంచాయతీలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. గొర్ల మందపై దాడి చేయడంతో 9 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మ్యాదరి పేటకు చెందిన మెరుగు ధర్మయ్యకు చెందిన గొర్రెల మందపై గురువారం రాత్రి కుక్కలు దాడికి పాల్పడి 9 గొర్రెలను హతమార్చాయి. 

ALSO READ:  బీసీ బంధు కోసం రోడ్డెక్కిన .. వడ్డెర, మేదరి కులస్తులు

గొర్లు చనిపోవడంతో గొర్రెల పెంపకంతోనే జీవనం సాగిస్తున్న ధర్మయ్య కుటుంబ బోరున ఏడ్చింది. దాదాపు రూ.లక్షా 50 వేల నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.