బీసీ బంధు కోసం రోడ్డెక్కిన .. వడ్డెర, మేదరి కులస్తులు

బీసీ బంధు కోసం రోడ్డెక్కిన .. వడ్డెర, మేదరి కులస్తులు

కుభీరు, వెలుగు :  తమకు బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుభీర్ మండల కేంద్రంలోని వడ్డెరలు, మేదరి కులస్తులు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం వివేకానంద చౌరస్తా వద్ద బైంసా- కుభీర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. 

ALSO READ: బోగస్​ ఓట్లపై విచారణ జరపండి : అర్వింద్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కులాలపై ఎమ్మెల్యే, స్థానిక నాయకులు చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరికి కూడా బీసీ బంధు ఇవ్వలేదన్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో తమ కాలనీలు ముంపునకు గురవుతున్నా ఏ ఒక్క నేతా పట్టించుకోవడంలేదని ఫైర్​అయ్యారు. ప్రభుత్వం తమకు డబుల్​బెడ్రూంలు ఇవ్వాలని, అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్​చేశారు.