మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీ కొనడంతో 9 మంది స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. పుణె-సోలాపూర్ హైవేపై కడమ్వాక్ వస్తీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు పూర్తి నుజ్జునుజ్జైంది. చాలా వేగంగా ఢీకొనడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెప్పారు.
