బోరు బావిలో పడ్డ బాలుడు..కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్

బోరు బావిలో పడ్డ బాలుడు..కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్

దేశంలో బోరుబావిలో బాలుడు పడిన ఘటనలు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన చిన్నారు అందులో పడి నరకయాతన అనుభవిస్తూ మృత్యువాతపడుతున్నారు. 

బోరు బావుల్లో పడి ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.  వృథాగా మిగిలిన బోరు బావుల దగ్గరికి వెళ్లవద్దని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పకపోవడం కూడా ఈ దారుణాలకు కారణమవుతున్నది. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లాలోగల భోజ్‌పురా గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది.

స్నేహితులతో ఆడుకుంటూ వెళ్లి ఓ తొమ్మిదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడి స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని రక్షించేందుకు సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బందిని, NDRF బలగాలను పిలిపించారు.