కరోనా మృతుల్లో 40 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ!

కరోనా మృతుల్లో 40 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం మగవాళ్లే ఉన్నారు. మహమ్మారి దెబ్బతో చనిపోయిన వారిలో మహిళల సంఖ్య కంటే పురుషులు రెట్టింపుగా ఉన్నారు. వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచిన వారిలో 69 శాతం మంది పురుషులేనని హెల్త్ మినిస్ట్రీ డేటా ప్రకారం తెలుస్తోంది. కరోనాతో చనిపోయిన వారిలో మహిళలు, పురుషులను కలుపుకొని చూసుకుంటే మృతుల్లో 90 శాతం మంది 40 ఏళ్ల లోపు పైబడిన వారు ఉండటం గమనార్హం. ఆగస్టు 22 నాటికి 56,292 మంది మృతుల్లో 50-70 ఏళ్ల వయస్కులే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలోనూ పురుషులు 38,973 మంది ఉండగా, మహిళలు 17,315 మంది ఉన్నారు. కరోనా బారిన పడి చనిపోయిన వారిలో 10 ఏళ్ల లోపు వారిలో 301 మంది పిలల్లు ఉన్నారు.