తొలి రోజు భారీగా నామినేషన్లు..'890 మంది నుంచి 902 నామినేషన్ల స్వీకరణ.. కాంగ్రెస్ నుంచే అత్యధికం

తొలి రోజు భారీగా నామినేషన్లు..'890 మంది నుంచి 902 నామినేషన్ల స్వీకరణ.. కాంగ్రెస్ నుంచే అత్యధికం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు భారీగా నామినేషన్లు పడ్తున్నాయి.  నామినేషన్ల స్వీకరణకు తొలిరోజైన బుధవారం ఏకంగా 890 మంది నుంచి 902 నామినేషన్లు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఆయా చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్లు నోటీస్ విడుదల చేశారు. 

ఆ తర్వాత ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 123 అర్బన్ లోకల్ బాడీస్ లలో 2,996 వార్డులకు గాను తొలిరోజు 890 మంది అభ్యర్థుల నుంచి 902 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్​లో ప్రకటించారు. బీ ఫారాలపై క్లారిటీ లేకపోవడంతో ప్రధాన పార్టీల నుంచి ఆశావాహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. 

అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 382 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసర్లు తెలిపారు. బీఆర్ఎస్ నుంచి 258, బీజేపీ నుంచి 169, ఆప్ నుంచి ఒకటి, బీఎస్పీ నుంచి ఏడు, సీపీఎం నుంచి 8, ఎంఐఎం నుంచి 3, ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 19 నామినేషన్లు పడగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు 55 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.