
- 2024-25 లో ట్రేడర్‌కు సగటును రూ.1.1 లక్షలు లాస్
- 91 శాతం మందికి నష్టమే
న్యూఢిల్లీ: ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ (డెరివేటివ్–ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ రూల్స్‌ను సెబీ కఠినతరం చేసినా, ఇన్వెస్టర్లు నష్టాలు ఇంకా భారీగానే ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ట్రేడర్ల నష్టాలు 41శాతం పెరిగి రూ.1.06 లక్షల కోట్లకు చేరాయి (2023–24లో రూ.74,812 కోట్ల లాస్). సగటున ఒక వ్యక్తికి రూ.1.1 లక్షల (అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.86,728) నష్టం వచ్చింది.
91శాతం ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు నష్టాలు చవిచూశారు. నాలుగేళ్లలో మొత్తం నష్టం రూ.2.86 లక్షల కోట్లుగా ఉంది. ఎఫ్ అండ్ ఓ ట్రేడర్ల సంఖ్య 20శాతం తగ్గినా, రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇంకా 24శాతం ఎక్కువగా ఉంది. ఇండెక్స్ ఆప్షన్స్‌లో ప్రీమియం టర్నోవర్ 9శాతం తగ్గింది. కానీ రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇంకా ఎక్కువగానే ఉంది.