కరోనా కట్టడిలో మోడీనే టాప్‌

కరోనా కట్టడిలో మోడీనే టాప్‌
  • సర్వే ద్వారా వెల్లడి
  • 93 శాతం మంది ప్రజలు మోడీని నమ్ముతున్నరు
  •  గ్లోబల్‌ సర్వేలో కూడా మన ప్రధానే ఫస్ట్‌
  • మోడీని పొగుడుతూ అమిత్‌ షా ట్వీట్‌
  • న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో మోడీనే టాప్‌ అని ప్రజలు నమ్ముతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఆయన సమర్థంగా హ్యాండిల్‌ చేస్తున్నారని దేశంలోని 93 శాతం ప్రజలు నమ్ముతున్నారని ఐఏఎన్‌ఎస్‌ – సీ – ఓటర్‌ చేసిన ద్వారా ‌వెల్లడైంది. లాక్‌డౌన్‌ విధించి మొదటి రోజు 76.8 శాతం మంది మోడీ తీసుకున్న డెసిషన్‌ కరెక్ట్‌ అని చెప్పగా.. ఈ నెల 21 నాటికి 93.5 శాతం మంది మోడీ వైపే ఉన్నారని సర్వే ద్వారా తెలుస్తోంది. కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచ లీడర్లందరికంటే ప్రధాని మోడీ సమర్థంగా పనిచేస్తున్నారని యూఎస్‌కు చెందిన మార్నింగ్‌ కంసల్ట్‌ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆ సర్వేకు సంబంధించిన వివరాలను ట్వీట్‌ చేశారు. “ నిజం స్వయంగా కనిపిస్తోంది. ఇలాంటి చాలెంజింగ్‌ సమయాల్లో దేశ ప్రజలను కాపాడుతున్న తీరు, మహమ్మారిని ఎదుర్కొనేందుకు మోడీ తీసుకున్న చర్యలను చూసిన ప్రపంచం ఆయన్ను ప్రశంసిస్తోంది” అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఇతర గ్లోబల్‌ లీడర్లకంటే మోడీ చాలా పాయింట్లు ఎక్కువగా ఉన్నారని, ఈ నెల 13 నాటికి 75 పాయింట్లకు చేరుకున్నారని షా అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ సర్వే రిజల్ట్‌ను పోస్ట్‌ చేశారు. ఇలాంటి కష్టకాలంలో కూడా మోడీ లీడర్‌‌ షిప్‌ అద్భుతంగా ఉందని ఆమె అన్నారు. మోడీ తర్వాత స్థానంలో మెక్సికో ప్రెసిడెంట్‌ లోపెజ్‌ అబ్రాడర్‌‌, ఆయన తర్వాతి స్థానంలో యూకే పీఎం బొరిస్‌ జాన్సన్‌ ఉన్నారు. జనవరి 1 నుంచి ఈ నెల 12 వరకు సర్వే చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. అయితే ఈ సర్వే ఫలితాలను ఇతర దేశాల నాయకులు ఆమోదించారా.. లేదా సర్వే చేసిన వారు ఆయా దేశాల్లో వాళ్ల సొంత దేశాల నాయకుల గురించి అడిగారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. మరికొంత మంది నెగటివ్‌ రెస్పాన్స్‌లో ఉన్నట్లు సర్వే రిజల్ట్‌లో తేలింది.