వర్ధన్నపేట, వెలుగు : ఓ వృద్ధుడు ముక్కులో ఫీడింగ్ పైప్, చేతిలో యూరిన్ బ్యాగ్ పట్టుకొని వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన 95 ఏండ్ల ఊట్ల తిరుపతిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఆరోగ్యం సహకరించకున్నా ఓటు వేయాలన్న సంకల్పంతో, కుటంబ సభ్యుల సహకారంతో వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు వేస్తేనే బతికున్నట్లు అని, ఓటు హక్కు వినియోగమే.. నిజమైన ఆక్సిజన్ అని పెద్దాయన చెప్పడం పలువురిని ఆలోచింపజేస్తోంది.

