మా వాళ్లకు డబ్బు గురించి తెలియట్లే

మా వాళ్లకు డబ్బు గురించి తెలియట్లే
  • స్టూడెంట్ల తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే    
  • మువిన్​ అండ్​ మామ్స్‌​ప్రెస్సో సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: తమ పిల్లలకు ఫైనాన్షియల్ నాలెడ్జ్​ చాలా తక్కువ ఉంటోందని 96 శాతం మంది తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. అయితే డిజిటల్ వాలెట్ల గురించి తెలుసుకోవడానికి, వాడుకోవడానికి మాత్రం ఆసక్తి చూపుతున్నారు. మువిన్,  మామ్స్‌‌ప్రెస్సో చేసిన సర్వే ద్వారా ఈ వివరాలు తెలిశాయి. దీని ప్రకారం ప్రకారం మెజారిటీ భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లలకు మనీ మేనేజ్‌‌మెంట్ టూల్స్​ గురించి తగినంత జ్ఞానం లేదని, ఫైనాన్షియల్​ ఎడ్యుకేషన్​ కోసం నమ్మకమైన సోర్స్​ అవసరమని అంటున్నారు.  బెంగళూరు కేంద్రంగా పనిచేసే మువిన్ ​కో–ఫౌండర్లు వినీత్ గుప్తా,  ముకుంద్ రావు నాయకత్వంలోని టీనేజ్-సెంట్రిక్ పాకెట్ మనీ యాప్​ను నడుపుతోంది.  

మామ్స్​ప్రెస్సో డాట్​కామ్​ 2010లో ప్రారంభమయింది. మహిళలు తమ ఆలోచనలను, భావాలను పంచుకోవడానికి ఈ  ప్లాట్‌‌ఫారమ్ ద్వారా సంపాదించడానికి వీలవుతుంది.  భారతదేశపు టీనేజర్లు/ యువకులు న్యూజెనరేషన్​ డిజిటల్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. డిజిటల్ చెల్లింపుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉందని 93శాతం మంది టీనేజ్ రెస్పాండెంట్లు చెప్పారు. వారిలో కేవలం 22శాతం మంది మాత్రమే డిజిటల్ చెల్లింపులను ఈజీగా ఉపయోగిస్తున్నామనే నమ్మకంతో ఉన్నారు. 

క్రిప్టోలు అంటే ఇష్టమే..

ఈ సర్వే కోసం 7–-12 తరగతుల్లో చదువుతున్న 600 మంది యువకులను/టీనేజర్లతో వారి తల్లిదండ్రులతో (600 మంది) మాట్లాడారు.  సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 94 శాతం మంది తమ పిల్లలు డిజిటల్ వాలెట్ల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు.  బ్లాక్‌‌చెయిన్  నాన్- ఫంగబుల్ టోకెన్‌‌ల (ఎన్​ఎఫ్​టీలు) వంటి క్రిప్టో ఆస్తుల గురించి తెలుసుకోవాలని 70 శాతం మంది అనుకుంటున్నారు. మువిన్ కో–ఫౌండర్​ ముకుంద్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మనదేశ యువకులు ప్రస్తుతం ఎక్కువగా ఆర్థికంగా స్వతంత్రంగా మారుతున్నారు.   తమ పర్సనల్​  లైఫ్​, గ్యాడ్జెట్‌‌లు, ఫ్యాషన్, ఆహారం లేదా ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో నచ్చినట్టుగా నడుచుకుంటున్నారు. ఈ విషయంలో వారికంటూ కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి”అని వివరించారు. ‘‘యువతలో ఫైనాన్షియల్​ లిటరసీ (ఆర్థిక అక్షరాస్యత) అవసరం పెరుగుతోంది. ఆర్థిక అక్షరాస్యత సర్వేలో  ఈ విషయం స్పష్టమైంది. మువిన్​తో కలిసి మనీ ఒలింపియాడ్ అనే ప్రోగ్రామ్​ నిర్వహిస్తున్నాం. డబ్బు విషయంలో టీనేజర్లు సమర్థంగా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిది. దీనికి ఎంతో ఆదరణ వస్తోంది" అని  మామ్స్​ప్రెస్సో  సీఓఓ  ప్రశాంత్ సిన్హా  అన్నారు.