కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 96,551 కేసులు..1209 మరణాలు

కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 96,551 కేసులు..1209 మరణాలు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. టెస్టులు పెరిగిన కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి దేశంలో 11 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తున్నారు..కేసులు కూడా పెరుగుతున్నాయి.  గత రెండు రోజులుగా 95 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.నిన్న ఒక్కరోజే అత్యధికంగా 96,551 కొత్త కేసులు నమోదవ్వగా ..1209 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసులు మొత్తం 45,62,415కు చేరగా మరణాల సంఖ్య 76,271 కు చేరింది.35,42,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 9,43,480 మంది ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే 11,63,542 మందికి టెస్టులు చేశారు.దీంతో దేశంలో సెప్టెంబర్ 10 వరకు  కరోనా టెస్టుల సంఖ్య 5,40,97,975 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.