
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 97 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రమోషన్ల కోసం ఉద్యోగులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా 97 మందికి పదోన్నతి కల్పించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.