స్కూళ్లు ప్రారంభమైన రెండు వారాల్లోనే 97 వేల మంది చిన్నారులకు కరోనా

స్కూళ్లు ప్రారంభమైన రెండు వారాల్లోనే 97 వేల మంది చిన్నారులకు కరోనా

కరోనా వైరస్ నుంచి కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కాస్తంత కోలుకుంటున్నాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం స్కూళ్లను తెరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే అలా స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయో లేదో అప్పుడే చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో గడచిన రెండు వారాల్లో ఒక్క అమెరికాలోనే 97 వేల మంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది. జూలై 16 నుంచి జూలై 30 మధ్య దాదాపు లక్ష మంది పిల్లలకు వ్యాధి సోకిందని… దీంతో స్కూళ్లను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.

అమెరికాలో ఇంతవరకూ సుమారు 50 లక్షల మంది కరోనా బారిన పడ్డారని ప్రచారం చేసిన సీబీఎస్ న్యూస్ వీరిలో సుమారు 3.38 లక్షల మంది పిల్లలేనని తెలిపింది. సమీప భవిష్యత్తులో పిల్లలకు టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చని వాండర్ బిల్ట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ టినా హార్టర్ట్  అన్నారు. స్కూళ్లను తెరవడానికి ముందే చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు.

అమెరికాలో ఇప్పటివరకూ కరోనా కారణంగా దాదాపు 25 వేల మందికి పైగా పిల్లలు చనిపోయారు. దీంతో ఆన్ లైన్ క్లాసులను మాత్రమే ఈ ఏడాది జరిపించాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వస్తోంది. వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో వ్యాక్సిన్ వచ్చేంత వరకూ స్కూళ్లు వద్దని కోరుతున్నారు.