ఐపీఎల్‌ ఆక్షన్ కు 971 మంది

ఐపీఎల్‌ ఆక్షన్ కు 971 మంది

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ ట్రేడ్‌‌ విండో, రిటేన్‌‌ గడువు ముగియడంతో ఇప్పుడు వేలంపై దృష్టి నెలకొంది. ఈనెల 19న కోల్‌‌కతాలో జరిగే ఆక్షన్‌‌లో మొత్తం 971 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 713 ఇండియన్స్‌‌ కాగా 258 మంది ఓవర్‌‌సీస్‌‌ క్రికెటర్లు ఉన్నారు. ఐపీఎల్‌‌లోని ఎనిమిది ఫ్రాంచైజీల్లో ప్రస్తుతం 73 ఖాళీలు ఉన్నాయి. ఇందుకోసం 215 క్యాప్‌‌డ్‌‌, 754 అన్‌‌క్యాప్‌‌డ్‌‌ ప్లేయర్లతో పాటు అసోసియేట్‌‌ నేషన్స్‌‌ నుంచి ఇద్దరు క్రికెటర్లు పోటీపడుతున్నారు. నవంబర్ 30తో ఐపీఎల్‌‌ ప్లేయర్‌‌ రిజిస్ట్రేషన్‌‌ గడువు ముగిసింది. రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్న ప్లేయర్లను ఎంపిక చేసుకుని ఫ్రాంచైజీలు షార్ట్‌‌ లిస్ట్‌‌ను ఈనెల 9 వరకు నిర్వాహకులకు అందించాలి.   ఆసీస్​ పేసర్​ స్టార్క్​, ఇంగ్లండ్​ కెప్టెన్​ జో రూట్​ ఈ వేలానికి అందుబాటులో ఉండటం లేదు. ఆస్ట్రేలియా (55), అఫ్గానిస్థాన్‌‌ (19), బంగ్లాదేశ్‌‌ (6), ఇంగ్లండ్‌‌ (22), నెదర్లాండ్స్‌‌ (1), న్యూజిలాండ్‌‌ (24), సౌతాఫ్రికా (54), శ్రీలంక (39), అమెరికా (1), వెస్టిండీస్‌‌ (34), జింబాబ్వే (3) క్రికెటర్లు ఆక్షన్‌‌కు అందుబాటులో ఉండనున్నారు.

హోస్టింగ్‌‌ ఫీజు పెంపు!

డొమెస్టిక్‌‌ మ్యాచ్‌‌ హోస్టింగ్‌‌ ఫీజును పెంచేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ మేరకు స్టేట్‌‌ అసోసియేషన్లు చేసిన విజ్ఞప్తికి బోర్డు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్లేయింగ్‌‌, నాన్‌‌–ప్లేయింగ్‌‌ డేస్‌‌ను కూడా ఇందులో పరిగణనలోకి తీసుకోనున్నారు. ‘నాన్‌‌ ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌లకు గతంలో బీసీసీఐ ప్రతి రోజు రూ. 1 లక్ష ఇచ్చేది. అది కూడా మ్యాచ్‌‌ జరిగే రోజులకే. దీనిని పెంచాలని చెప్పాం.  నాన్‌‌ మ్యాచ్‌‌ రోజుల్లో కూడా ట్రావెలింగ్‌‌ చార్జెస్‌‌, ప్రాక్టీస్‌‌ అరెంజ్‌‌మెంట్స్‌‌ ఖర్చులు ఉంటాయి. వీటిని కూడా ఓసారి రివ్యూ చేయాలని కోరాం’ అని ఏజీఎమ్‌‌లో పాల్గొన్న ఓ మెంబర్‌‌ వెల్లడించాడు. మరోవైపు 60 ఏళ్ల వయసు కారణంగా 17 మంది స్కోరర్లను బలవంతంగా రిటైర్‌‌ చేయించారు. దీనిపై మెంబర్స్‌‌ అభ్యంతరం చెప్పడంతో ఈ అంశాన్ని కూడా బీసీసీఐ మరోసారి
పరిశీలించనుంది.

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ ట్రేడ్‌‌ విండో, రిటేన్‌‌ గడువు ముగియడంతో ఇప్పుడు వేలంపై దృష్టి నెలకొంది. ఈనెల 19న కోల్‌‌కతాలో జరిగే ఆక్షన్‌‌లో మొత్తం 971 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 713 ఇండియన్స్‌‌ కాగా 258 మంది ఓవర్‌‌సీస్‌‌ క్రికెటర్లు ఉన్నారు. ఐపీఎల్‌‌లోని ఎనిమిది ఫ్రాంచైజీల్లో ప్రస్తుతం 73 ఖాళీలు ఉన్నాయి. ఇందుకోసం 215 క్యాప్‌‌డ్‌‌, 754 అన్‌‌క్యాప్‌‌డ్‌‌ ప్లేయర్లతో పాటు అసోసియేట్‌‌ నేషన్స్‌‌ నుంచి ఇద్దరు క్రికెటర్లు పోటీపడుతున్నారు. నవంబర్ 30తో ఐపీఎల్‌‌ ప్లేయర్‌‌ రిజిస్ట్రేషన్‌‌ గడువు ముగిసింది. రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్న ప్లేయర్లను ఎంపిక చేసుకుని ఫ్రాంచైజీలు షార్ట్‌‌ లిస్ట్‌‌ను ఈనెల 9 వరకు నిర్వాహకులకు అందించాలి.   ఆసీస్​ పేసర్​ స్టార్క్​, ఇంగ్లండ్​ కెప్టెన్​ జో రూట్​ ఈ వేలానికి అందుబాటులో ఉండటం లేదు. ఆస్ట్రేలియా (55), అఫ్గానిస్థాన్‌‌ (19), బంగ్లాదేశ్‌‌ (6), ఇంగ్లండ్‌‌ (22), నెదర్లాండ్స్‌‌ (1), న్యూజిలాండ్‌‌ (24), సౌతాఫ్రికా (54), శ్రీలంక (39), అమెరికా (1), వెస్టిండీస్‌‌ (34), జింబాబ్వే (3) క్రికెటర్లు ఆక్షన్‌‌కు అందుబాటులో ఉండనున్నారు.

హోస్టింగ్‌‌ ఫీజు పెంపు!

డొమెస్టిక్‌‌ మ్యాచ్‌‌ హోస్టింగ్‌‌ ఫీజును పెంచేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ మేరకు స్టేట్‌‌ అసోసియేషన్లు చేసిన విజ్ఞప్తికి బోర్డు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్లేయింగ్‌‌, నాన్‌‌–ప్లేయింగ్‌‌ డేస్‌‌ను కూడా ఇందులో పరిగణనలోకి తీసుకోనున్నారు. ‘నాన్‌‌ ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌లకు గతంలో బీసీసీఐ ప్రతి రోజు రూ. 1 లక్ష ఇచ్చేది. అది కూడా మ్యాచ్‌‌ జరిగే రోజులకే. దీనిని పెంచాలని చెప్పాం.  నాన్‌‌ మ్యాచ్‌‌ రోజుల్లో కూడా ట్రావెలింగ్‌‌ చార్జెస్‌‌, ప్రాక్టీస్‌‌ అరెంజ్‌‌మెంట్స్‌‌ ఖర్చులు ఉంటాయి. వీటిని కూడా ఓసారి రివ్యూ చేయాలని కోరాం’ అని ఏజీఎమ్‌‌లో పాల్గొన్న ఓ మెంబర్‌‌ వెల్లడించాడు. మరోవైపు 60 ఏళ్ల వయసు కారణంగా 17 మంది స్కోరర్లను బలవంతంగా రిటైర్‌‌ చేయించారు. దీనిపై మెంబర్స్‌‌ అభ్యంతరం చెప్పడంతో ఈ అంశాన్ని కూడా బీసీసీఐ మరోసారి పరిశీలించనుంది.