హజ్ యాత్ర: ఈసారి 98 మంది భారతీయులు మృతి

హజ్ యాత్ర: ఈసారి 98 మంది భారతీయులు మృతి

హజ్ యాత్ర సందర్భంగా ఈఏడాది మక్కా యాత్రకు వెళ్లిన 98 మంది భారతీయ సందర్శకులు చనిపోయారని విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారందరూ కూడా వృద్ధాప్యం, అనారోగ్యం లక్షణాల కారణాలతోనే చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. 2023లో హజ్ యాత్ర చేసిన 200లకు పైగా యాత్రికులు చనిపోయారు. సౌదీ అరేబియాలో జూలై 9 నుంచి 22 వరకు మక్కా నిర్వహించనున్నారు. 

ఇప్పటి వరకు హజ్ యాత్రలో భాగంగా లక్షా 75 వేల మంది భారతీయులు సౌదీకి వెళ్లారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.  సౌదీలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు 50డిగ్రీలను దాటాయి.  మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు ఈసారి హజ్ యాత్రకు వచ్చిన 550 మంది సందర్శకులు వివిధ కారణాలతో మృతిచెందారని ప్రకటించారు.