బెంగళూరు: వారానికి 70 గంటల పాటు పనిచేయాలని గతంలో వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి తన కామెంట్లను సమర్థించుకున్నారు. ఈసారి చైనా 9– 9– 6 రూల్‌ను ఉదాహరణగా చూపుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఓ ఇంగ్లిష్ న్యూస్ చానెల్‌తో ఆయన మాట్లాడారు. ‘‘చైనాలో ఒక సామెత ఉంది. అదే 9, 9,6. అంటే చైనాలో ఉద్యోగులు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వారంలో 6 రోజులు పనిచేస్తారు. మన దేశంలో కూడా యువత ఈ 9, 9, 6 ఫార్ములాను ఫాలో కావాలి. వారానికి మన యువత కూడా 72 గంటలు పనిచేయాలి. మొదట ఉద్యోగం పొందాలి. ఆ తర్వాతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చింతించాలి” అని మూర్తి పేర్కొన్నారు.
