ఓటింగ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

ఓటింగ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షోలో తొమ్మిదవ వారం ఎలిమినేషన్ కు రంగం సిద్ధమైంది. గత వారం అనూహ్యంగా  ఆట సందీప్ ఎలిమినేట్ అవగా.. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈవారం యావర్, అమర్, తేజ, ప్రియాంక, భోలే, శోభ, రతిక, అర్జున్ నామినేషన్స్ లో ఉన్నారు. 

ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. ప్రియాంక, శోభ, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురికి తక్కువ ఓట్లు వస్తున్నాయి. ఈ ముగ్గురిలో ప్రియాంక కాస్త పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. నిజానికి ఈవారం శోభా ఎలిమినేట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. కానీ అనూహ్యంగా శోభా ఈ వారం కెప్టెన్ అయ్యింది.  అయినప్పటికీ ఆమె ఎలిమినేషన్ కు ఛాన్స్ ఉంది కానీ.. గత వారంలాగే ఆమెను సేవ్ చేసి.. తన స్థానంలో టేస్టీ తేజను బలి చేయనున్నారు. దీంతో ఈ వారం తేజ గుడ్ బై చెప్పనున్నాడని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది.

నిజానికి తేజకి హౌస్లో మంచి ఎంటర్టైనర్ గా పేరు ఉంది. తన మార్క్ పంచ్లలతో అటు ఆడియన్స్ ను, ఇటు హౌస్ మేట్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేశాడు. కానీ అతను చేసే సిల్లీ నామినేషన్స్ ఆడియన్స్ కు నచ్చలేదు. ఆ కారణంగా ఇప్పటికే ముగ్గురు ఇంటినుండి బయటకు వెళ్లిపోయారు. దాంతో తేజకు బయట నెగిటివిటీ మొదలైంది. ఈ కారణంగానే తేజ బయటకు వెళ్తున్నారని తెలుస్తోంది.