రొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన పెంచాలి

రొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన పెంచాలి

ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్ కంటే రొమ్ము క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని ఉస్మానియా ఆసుపత్రి వైద్యురాలు, వి ఫర్ ఉమెన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రతిభ లక్ష్మీ తెలిపారు.రొమ్ము క్యాన్సర్ పై మహిళలలో అవగాహన పెంచేందుకు  హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 2 కె వాక్ నిర్వహించారు. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుంచి జల విహార్ వరకు కొనసాగిన నడకలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

మహిళా సాధికారత కోసం తమ సంస్థ పని చేస్తోందని... రొమ్ము క్యాన్సర్ పై మహిళలలో అవగాహన కల్పించేందుకు చిన్నపాటి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రతిభ లక్ష్మీ తెలిపారు. మనకు తెలియకుండానే ప్రతి ఎనిమిది మంది లో రొమ్ము క్యాన్సర్ వస్తోందని...చాలా మందికి వృద్ధాప్యంలో క్యాన్సర్ వస్తోందని అనుకుంటున్నారని... కానీ ఈ రొమ్ము క్యాన్సర్ యువతులలో ఎక్కువగా వస్తుందని చెప్పారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తే మరణాలు తగ్గించవచ్చని పేర్కొన్నారు.