
బెంగళూరు: దేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. కోవిడ్తో బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. కొత్త వైరస్ను జేఎన్.1 వేరియంట్గా గుర్తించారు. ఒమిక్రాన్ బీఏ.2.86 నుంచి ఇది మార్పు చెందింది. ఈ మే నెలలో కేరళలో అత్యధికంగా 273 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
A 84-year-old man died of Covid in Bengaluru: Health Officials PTI AMP GMS
— Press Trust of India (@PTI_News) May 24, 2025
కేంద్ర వైద్యశాఖ దేశంలోని పరిస్థితిపై ఇప్పటికే సమీక్ష నిర్వహించింది. దేశంలో పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ధైర్యం చెప్పింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శనివారం కూడా దేశంలో కోవిడ్-19 కేసులపై సమీక్ష నిర్వహించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించారు.
జేఎన్.1 వేరియంట్ లక్షణాలు:
* జ్వరం
* ముక్కు కారటం
* గొంతు నొప్పి
* తలనొప్పి
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* ఆకలి లేకపోవడం
* వికారం, విపరీతమైన అలసట
* జీర్ణాశయాంతర సమస్యలు
* సాధారణంగా కనిపించే ఈ లక్షణాల నుంచి కోలుకునేందుకు 5 రోజులు పట్టొచ్చని వైద్యులు తెలిపారు.
హాంగ్ కాంగ్లో మొత్తం వెయ్యికి పైగా కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. కొత్త వేరియంట్తో 30 మందికి పైగా చనిపోయారు. సింగపూర్, హాంగ్ కాంగ్లో కరోనా కేసులు పెరగడంతో పాటు మన దేశంలోకి కూడా ఈ వేరియంట్ కేసులు బయటపడుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.