కాంగ్రెస్ నుంచి 92 ఏండ్ల శివశంకరప్ప గెలిచిండు

కాంగ్రెస్ నుంచి 92 ఏండ్ల శివశంకరప్ప గెలిచిండు

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన 92 ఏండ్ల వ్యక్తి అనూహ్య విజయం సాధించాడు. ఎన్నికలకు ముందు ఆయనకు టికెట్ ఇవ్వడంపై విమర్శలు వచ్చినా వాటన్నింటినీ ఆ పెద్దాయన తిప్పికొట్టాడు. ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యే శివశంకరప్ప. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల్లో ఆయనే వయసులో అతిపెద్ద వ్యక్తి. ‘‘92 ఏళ్ల వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారు? ఆయనకు ఎవరైనా ఓట్లు వేస్తారా?’’ అని సొంత పార్టీ నేతలే శివశంకరప్పపై మండిపడ్డారు.

సీన్ కట్ చేస్తే శివశంకరప్ప వరుసగా నాలుగోసారి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నేను రేసుగుర్రాన్ని. అందుకే నాకు కాంగ్రెస్  పార్టీ టికెట్  ఇచ్చింది. ముందు చెప్పినట్లే భారీ మెజారిటీతో గెలిచాను” అని ఆయన వ్యాఖ్యానించారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివశంకరప్ప  28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.