కరోనా వైరస్ : విషాదాన్ని నింపుతున్న వైరల్ వీడియో

కరోనా వైరస్ : విషాదాన్ని నింపుతున్న వైరల్ వీడియో

చిన్నారికి కరోనా వైరస్ సోకిందని.. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా వైరస్ చైనాను వణికిస్తుంది. భారత్ ను భయపెడుతోంది. కొత్త వైరస్ దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి చైనాలో  213 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా నుంచి భారత్, అమెరికా సహా 18 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 9.692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ పరిస్థితిపై నిన్న అత్యవసరంగా సమావేశమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ కమిటీ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం

బడ్జెట్ 2020 హైలైట్స్

లక్ష కోట్లకు వారసుడు.. 2 రూములున్న ఇంట్ల ఉంటున్నడు

కరోనా కు కేంద్రస్థానంగా భావిస్తున్న వుహాన్ నగరంలో ఓ చిన్నారికి వైరస్ సోకిందని.. ఆ చిన్నారికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఓ ఆస్పత్రి వార్డ్ లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశారు. అందులో ఆ చిన్నారిని ఒక్కడినే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో పలువుర్ని కంటతడిపెట్టిస్తోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్నారిని చూసేందుకు ఓ డాక్టర్ గదికి వస్తాడు. గదిలోపల చిన్నారి ఉండగా.. గది బయట డాక్టర్  చిన్నారిని ఆడించే ప్రయత్నం చేస్తాడు. వైరస్ భారిన పడిన ఆ చిన్నారిని చూసి తట్టుకోలేని డాక్టర్ వెనక్కి తిరిగి కన్నీటి పర్యంతరమయ్యాడు. అయితే అప్పటి వరకు తనని ఆడించిన డాక్టర్ వెనక్కి తిరగడంతో ఏం జరిగిందోనని అమాయకంగా చూస్తున్న చిన్నారి నెటిజన్లలో విషాదాన్ని నింపుతున్నాయి.

అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అథెనిక్స్ బై మౌమితా జన్నాట్ అనే ఫేస్ బుక్ పేజ్ లో వీడియో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఆ వీడియోను  2కోట్ల మందికి పైగా వీక్షించగా  58వేలమంది షేర్ చేశారు.

???

Posted by Aathenic's By Moumita Jannat on Thursday, January 30, 2020