అమెరికాలో నల్లజాతీయుడిని కొట్టి చంపేశారు!

అమెరికాలో నల్లజాతీయుడిని కొట్టి చంపేశారు!
  • ర్యాష్​ డ్రైవింగ్​ చేశాడని.. టెన్నెసీ పోలీసుల నిర్వాకం..
  • మృతుడి తల్లితో మాట్లాడిన బైడెన్

వాషింగ్టన్: నల్ల జాతీయుడితో అమెరికన్​ పోలీసు లు వ్యవహరించిన తీరు ప్రపంచమంతటా చర్చనీయాంశమైంది. ఓవర్​ స్పీడ్​గా వెళ్లాడని 29 ఏండ్ల నికోల్స్ అనే నల్ల జాతీయుడిని పోలీసులు దారుణంగా చితకబాదారు. ‘‘మామ్.. మామ్” అని అరుస్తున్నా వదల్లేదు. కింద పడుకోబెట్టి చేతులు కట్టేసి.. ముఖంపై దాడి చేశారు. నిలబడలేక కింద పడిపోతున్నా.. ఫేస్​పై ఫ్లాష్​ లైట్ వేస్తూ.. ఆరుగురు పోలీసులు నికోల్స్​ను దారుణంగా కొట్టారు. ఈ ఘటన జనవరి 7న జరిగింది. తీవ్రంగా గాయపడిన నికోల్స్.. 3 రోజుల తర్వాత చనిపోయాడు. పోలీసుల బాడీ కెమెరాల్లో ఇదంతా రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్​లో వైరల్ అవుతున్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా యూఎస్​లో నల్లజాతీయులు ఆందోళనకు దిగారు. ప్రెసిడెంట్ బైడెన్.. నికోలస్ ​కుటుంబానికి సారీ చెప్పారు. మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

కాళ్లు.. చేతులు గట్టిగా పట్టుకుని.. 

టైర్ నికోల్స్ ట్రాన్స్​పోర్టు కంపెనీ ఫెడ్​ఎక్స్​లో జాబ్ చేస్తుంటాడు. జనవరి 7న రాత్రి పని ముగించుకుని కారులో ఇంటికెళ్తున్నాడు. ఓవర్​ స్పీడ్, ర్యాష్​గా డ్రైవింగ్ చేశాడన్న కారణంతో సౌత్ యూఎస్​లోని మెంఫిన్​ పెట్రోలింగ్ పోలీసులు నికోల్స్​ను అడ్డుకున్నారు. డ్రైవింగ్ సీటు నుంచి బయటికి లాగి నేలపై పడుకోబెట్టి కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా వినిపించుకోలేదు. వారి నుంచి నికోల్స్​ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రిక్​ షాక్ వెపన్​ను ప్రయోగించారు.

పోలీసులే చంపేసిన్రు : రోవాన్ వెల్స్, నికోల్స్ తల్లి

నికోల్స్​కు నాలుగేండ్ల కొడుకు ఉన్నాడు. తల్లి అంటే ఎంతో ప్రేమ. అతని చేతిపై అమ్మ పేరుతో టాటూ కూడా ఉంది. నికోల్స్​ తల్లి శుక్రవారం రోవాన్ వెల్స్ ప్రెస్​మీట్​లో మాట్లాడారు. ‘‘యూఎస్ పోలీసులు నా కొడుకును చంపేశారు. డ్రంకెన్​ డ్రైవ్​లో పట్టుబడినట్టు పోలీసులు ఇంటికొచ్చి చెప్పారు. కప్స్​ వేస్తుంటే పారిపోయేందుకు ట్రై చేయడంతో పెప్పర్​ స్ర్పే యూజ్​ చేశామన్నారు. అదంతా అబద్ధం. నా కొడుకును దారుణంగా కొట్టిన పోలీసులను కఠినంగా శిక్షించాలి” అంటూ వెల్స్ ఏడుస్తూ చెప్పింది.