మెదక్ లో కోళ్ల వ్యాన్ బోల్తా..ఎగబడ్డ జనం

మెదక్ లో కోళ్ల వ్యాన్ బోల్తా..ఎగబడ్డ జనం

మెదక్ జిల్లాలో  కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహానం బోల్తా పడింది. అతివేగంతో వెళ్తున్న వాహనం..అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కోళ్లు రోడ్డుపై పడిపోయాయి. దీన్ని గమనించిన స్థానికులు..కోళ్ల కోసం ఎగబడ్డారు. అందిన కాడికి కోళ్లను ఎత్తుకెళ్లారు.

వరిలో పడ్డా కూడా వదల్లేదు..
రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులోని రోడ్డుపై కోళ్ల వ్యాన్ బోల్తాపడింది. దీంతో కొన్ని కోళ్లు వరిపొలంలో పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు..కోతకు వచ్చిన వరిలోకి కోళ్ల కోసం దిగారు. పోటీ పడి..కోళ్లను పట్టుకున్నారు. రోడ్డుపై వెళుతున్నవాళ్లు.. తమ బైక్లను పక్కనపెట్టి మరీ కోళ్లను పట్టే పనిలోపడ్డారు.  దొరికినవాళ్లు దొరికినట్లు ఎత్తుకుపోయారు. కొందరైతే..ఒక కోడితో సరిపెట్టుకోలేకపోయారు. రెండు చేతుల్లో మూడు నాలుగు కోళ్లను ఎత్తుకెళ్లారు. జనం కోళ్ల కోసం ఎగబడితే.. రైతు మాత్రం కోళ్ల కోసం పొట్టకొచ్చిన వరి పొలాన్ని పాడుచేస్తున్నారని మండిపడ్డాడు.