భయం భయంగా.. కొంచెం ధైర్యంగా..!

భయం భయంగా.. కొంచెం ధైర్యంగా..!

వేలాది మంది జనం! చుట్టూ తుపాకులు పట్టిన బలగాల బందోబస్తు! ఓ పండుగ జరుగుతోంది అక్కడ! ఇంతలోనే ఓ పిల్లాడి చిన్న బంతి అక్కడ పడిపోయింది. అది ఆ పోరడికి ఓ విలువైన వస్తువు. దాన్ని ఎలాగైనా తీసుకోవాలన్న తపన. కానీ, అక్కడ సైనికుడు ఉండన్న బెదురు. కళ్లల్లో బెరుకు. కొంచెం ధైర్యం చేశాడు. ముందుకు సాగిలపడ్డాడు. తుపాకీ పట్టిన ఆ సోల్జర్​ వెనక్కి తిరిగి చూసే లోపు తీసుకోవాలనుకున్నాడు. భయంభయంగానే ఆ సోల్జర్​ను చూస్తూ ధైర్యం చేసి తన బంతిని చటుక్కున అందుకుని మళ్లీ తన ప్లేస్​లోకి వెళ్లిపోయాడు. ఇది 2008లో లైబీరియా రాజధాని మొన్రోవియాలో తీసిన ఫొటో. సియెనా ఇంటర్నేషనల్​ ఫొటో అవార్డ్స్​ 2019 పోటీల్లో విజేతగా నిలిచింది. బ్రిటన్​కు చెందిన జొనాథన్​ బ్యాంక్స్​ అనే ఫొటోగ్రాఫర్​ ఈ ఫొటోను క్లిక్​మనిపించాడు. ‘ఎ బాయ్​ ఇన్​ ద క్రౌడ్​’ అని దానికి పేరు పెట్టాడు. ఈ పోటీలకు 54 దేశాలకు చెందిన 187 మంది ఫొటోగ్రాఫర్లు తాము తీసిన ఫొటోలను పంపారు. పది కేటగిరీల్లో అవార్డులు ఇచ్చారు. ఈ పిల్లాడి ఫొటో మాత్రం ఓవరాల్​ విన్నర్​గా నిలిచింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి