ఆ లేగదూడ ఇన్ స్పెక్టర్ ఫ్యామిలీ మెంబర్ అయింది

ఆ లేగదూడ ఇన్ స్పెక్టర్ ఫ్యామిలీ మెంబర్ అయింది

బెంగళూరు: ట్రాఫికర్ల నుంచి లేగ దూడను కాపాడిన ఓ పోలీస్ ఆఫీసర్ దానిని స్టేషన్​లోనే పెంచి పోషిస్తూ జంతుప్రేమను చాటుకున్నారు. కొందరు దూడను కారులో తీసుకెళ్తుండటం గమనించిన ఇనిస్పెక్టర్ దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయగా అది వదిలివేయబడినదిగా గుర్తించారు. ఆ రోజు నుంచి స్టేషన్​అవరణలోనే దూడకు పాలు, పప్పులు అందిస్తూ పోషిస్తున్నారు. ఇనిస్పెక్టర్ మహ్మద్ రఫీ దానికి భీమా అని పేరు పెట్టారు. ‘‘వెటర్నరీ డాక్టర్ల సూచనల మేరకు ప్రతిరోజు పాలు తాగిస్తున్నాం. ఇక్కడి నుంచి నేను ట్రాన్స్ ఫర్ అయినా కూడా భీమాను నాతో పాటు తీసుకెళ్తా. అది మా ఫ్యామిలీ మెంబర్ అయింది’ అని రఫీ చెప్తున్నారు.