కోతులను తప్పించబోయి పల్టీకొట్టిన కారు

కోతులను తప్పించబోయి పల్టీకొట్టిన కారు
  •     ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
  •     ఘట్ కేసర్ పరిధిలో ఔటర్ సర్వీసు రోడ్డులో ఘటన 

ఘట్ కేసర్, వెలుగు :  కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా అడ్డొచ్చిన కోతులను తప్పించబోయి పల్టీ కొట్టడంతో లో ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. ఇన్ స్పెక్టర్ గోవర్ధనగిరి తెలిపిన ప్రకారం..  ఘట్ కేసర్ నుంచి బాచారం వైపు మోర ఉపేందర్ (37), భార్య కావ్య, కూతురు భవ్యశ్రీ

 కుమారులు మనోజ్, పృథ్వీరాజులతో కలిసి టాటా కారులో ఔటర్ రింగ్ రోడ్డు పరిధి మూసీ నది సమీపంలో సర్వీస్ రోడ్డులో వెళ్తున్నారు. ఒక్కసారిగా కోతుల గుంపు అడ్డు రావడంతో ఉపేందర్ తప్పించబోగా కారు సర్వీసు రోడ్డు పైనుంచి పల్టీ కొట్టి గుంతలో పడింది. దీంతో ఉపేందర్ కు తీవ్ర గాయాలై స్పాట్ లో మృతి చెందాడు.

 భార్య, ముగ్గురు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను సిటీలోని ఓ ప్రవేటు హాస్పిటల్ తరలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు పంపించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.