వివేకా హత్యకేసులో సీబీఐ అధికారిపై కేసు న‌మోదు

వివేకా హత్యకేసులో సీబీఐ అధికారిపై కేసు న‌మోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తులో మంగ‌ళ‌వారం వ‌రుస ట్విస్టులు చోటుచేసుకున్నాయి. వివేకా దగ్గర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన ద‌స్త‌గిరి రెండో ద‌ఫా త‌న వాంగ్మూలాన్ని ఇవ్వ‌గా.. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి రామ్ సింగ్‌పై ఏకంగా కేసు న‌మోదు అయ్యింది. విచారణ పేరుతో రామ్ సింగ్ వేధిస్తున్నాడని కడప జిల్లా కోర్టులో పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో కడప రిమ్స్ పోలీసులు సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు.

వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తులో తాము చెప్పిన‌ట్లుగానే చెప్పాలని సీబీఐ అధికారులు వేధిస్తున్నారని.. వారు చెప్పినట్లుగా  చెప్పక పోతే కుటుంబం మొత్తాన్ని కేసులు ఇరికిస్తామని  సీబీఐ అధికారి రామ్ సింగ్ బెదిరించాడని ఇటీవల జిల్లా పోలీసు కార్యాలయంలో  ఏఆర్  అదనపు  ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు.


ఈ ఫిర్యాదు ఆధారంగా క‌డ‌ప రిమ్స్ స్టేష‌న్‌లో రామ్ సింగ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలి