
హైదరాబాద్, వెలుగు: మార్నింగ్ వాక్‌లో పరిచయమైన మహిళను వేధిస్తున్న సీఐడీ ఎస్పీపై చైతన్యపురి పీఎస్‌లో కేసు నమోదైంది. ఎల్బీనగర్ పరిధిలో ఉంటున్న సీఐడీ ఎస్పీకి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ శాఖకు చెందిన మహిళా ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న ఆయన ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. తనతో చనువుగా ఉండాలని మెసేజ్‌లు పెట్టేవారు.
ఇది పద్ధతి కాదని ఆమె చెప్పినా వినకుండా వేధిస్తుండడంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. వారి సూచన మేరకు చైతన్యపురి పీఎస్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. సీఐడీ ఎస్పీ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.