సూపర్ ఐడియా : లాంగ్ జర్నీ రైళ్లల్లో సినిమా ధియేటర్లు

సూపర్ ఐడియా : లాంగ్ జర్నీ రైళ్లల్లో సినిమా ధియేటర్లు

భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ.. ఆసియాలో రెండవది. 68వేల కిలోమీటర్ల ట్రాక్ పొడవుతో దేశంలోని వివిధ భాషాలు, సంస్కృతులున్న ప్రజలను ఏకం చేస్తుంది. రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైలు ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా.. అందమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రయాణంలో అందమైన దృశ్యాలు..భిన్నమైన వ్యక్తులు..స్నేహం గురించి చాలా కథలు కూడా ఉన్నాయి. అయితే రైళ్లలో ప్రయాణించేటప్పుడు టైం పాస్ చేయడం చాలా కష్టమైన పని. అలాంటి పరిస్థితుల్లో వినోదభరితంగా ఎలా హాయిగా ప్రయాణించాలో.. ఓ ప్రయాణికుడు వివరించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.. 

సాధారణంగా రైళ్లలో ప్రయాణించేవారు ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లలో సినిమాలు, వినోదభరిత సన్నివేశాలు చూస్తుంటారు. అయితే ఈ వీడియోలో ప్రయాణికుడు..ఎంటర్ టైన్ మెంట్ కోసం అద్బుతమైన ప్లాన్ వేశాడు. ఇది రైల్లో ప్రయాణిస్తూ..థియేటర్ లో సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది. అతడు కదులుతున్న రైళ్లో ఓ తెల్లటి షీట్ వేలాడదీసి.. ప్రొజెక్టర్ సాయంతో ఫిల్మ్ ప్లే చేసి.. తనతోపాటు తోటి ప్రయాణికులు కూడా ఎంజాయ్ చేసేలా ఏర్పాటు చేశాడు ఆ ప్రయాణికుడు.

ఆ ప్రయాణికుడు ఏర్పాటు చేసిన ఎంటర్ టైన్ మెంట్ ను ఆస్వాదించిన ప్రయాణికులు .. ‘అబ్బ రైళ్లలో కూడా ఇలా థియేటర్లు ఏర్పాటు చేసి సినిమాలు చూపిస్తే బాగుండు కదా అని ’’ అనుకున్నారట. నిజంగానే బాగుంటుంది కదా..