కారం పొడి, కర్రలతో దాడి..ఉద్రిక్తతకు దారితీసిన భూ వివాదం

కారం పొడి, కర్రలతో దాడి..ఉద్రిక్తతకు దారితీసిన భూ వివాదం

కామారెడ్డి జిల్లా ఓ భూతగాదా ఉద్రిక్తతకు దారి తీసింది. లింగాయిపల్లి గ్రామంలో భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  భూవివాదంలో ఓ వర్గంపై మరో వర్గం దాడి చేసింది. కళ్లలో  కారంపొడి  చల్లి ...కర్రలతో కొట్టారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. 

గత కొద్ది నెలలుగా తోట లింగం కుటుంబం, పోచయ్య, రాజయ్య, సిద్దవ్వ, లక్ష్మి, అంజయ్య  మధ్య  భూమి విషయంలో గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే  రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో..తోట లింగం కుటుంబ సభ్యులు కారం పొడి, కర్రలతో దాడి చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడి చేసిన లింగం కుటుంబ సభ్యులపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.