పరిగి వెలుగు : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నామత్ నగర్ లో సోమవారం ఇస్తేమా ముగిసింది. కర్ణాటక ,మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాల ముస్లింలు కార్యక్రమానికి హాజరయ్యారు.
జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇస్తేమా కార్యక్రమాన్ని ముస్లిం మత పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
