ప్రేమ.. పెళ్లి.. ఇప్పుడు విడాకులు.. అన్నిటికీ తొందరే

ప్రేమ.. పెళ్లి.. ఇప్పుడు విడాకులు.. అన్నిటికీ తొందరే

బాలీవుడ్​ స్టార్​ సింగర్​ నేహా కక్కర్(Neha Kakkar)​ విడాకుల అంశం నెట్టింట హాట్​  టాపిక్​గా మారింది. రెండేళ్ల క్రితం బాలీవుడ్​ సింగర్​ రోహన్​(Rohan)ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిలో టాప్​ సెలబ్రిటీలంతా చేరి సందడి చేశారు. పెళ్లి బట్టల దగ్గరనుంచి వేదిక దాకా అన్నింటిపైనా నెట్టింట చర్చ జరిగింది. ఇండియన్​ ఐడల్​ సీజన్(India idol 12)​ 12కి వీరు జడ్జిలుగా వ్యవహరించారు. అప్పుడు ప్రేమలో పడ్డ వీరు పెద్దలను ఒప్పించి మరీ ఒక్కటయ్యారు.

తాజాగా నేహా తన 35వ బర్త్​డేను గ్రాండ్​గా సెలబ్రేట్​ చేసుకుంది. ఇందులో ఆమె భర్త తప్ప స్నేహితులు, బంధువులంతా ఉండటంతో నెటిజన్లలో డౌట్​ మొదలైంది. దీంతో మీరిద్దరూ విడిపోయారా? అంటూ డైరెక్ట్​గానే ఈ సింగర్​పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై రోహన్​ కూడా నోరు మెదపకపోవడంతో నిజంగానే వీరి మధ్య విబేధాలున్నాయని అనుకుంటున్నారు. మరి ఈ రూమర్లు ఆగాలంటే వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.