ఉస్మానియాలో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ ప్రారంభం

ఉస్మానియాలో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ ప్రారంభం

హైదరాబాద్: మధుమేహం వ్యాధి వల్ల కాలి సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రిలో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ ను ప్రారంభించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను గురువారం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్... ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ రెడ్డి, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.త్రివేణి, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ రాకేష్ సహాయ్ తో కలిసి లాంఛనంగా  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్  మాట్లాడుతూ... రోజు రోజుకు మధుమేహ వ్యాధి బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. మధు మేహ వ్యాధి బారిన పడిన వారి కోసం ఈ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్లినిక్ ద్వారా న్యూరోపతి, డాప్లర్  స్టడీ వంటి సేవలు రోగులకు లభిస్తాయని చెప్పారు. సరైన ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా డయాబెటీస్ ను సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చన్నారు.

మరిన్ని వార్తల కోసం...

సందీప్ కిషన్ బర్త్ డే గిఫ్ట్స్ వచ్చేశాయ్..!

జాబ్స్ పేరుతో అమ్మాయిలకు బ్లాక్ మెయిల్..షీ టీమ్స్కి