జాబ్స్ పేరుతో అమ్మాయిలకు బ్లాక్ మెయిల్..షీ టీమ్స్కి వెల్లువలా ఫిర్యాదులు

జాబ్స్ పేరుతో అమ్మాయిలకు బ్లాక్ మెయిల్..షీ టీమ్స్కి వెల్లువలా ఫిర్యాదులు
 • ఆకతాయిలకు వణుకు పుట్టిస్తున్న షీ టీమ్స్
 • షీ టీమ్స్కి వెల్లువలా వస్తున్న ఫిర్యాదులు
 • మఫ్టీలో డెకాయ్ నిర్వహిస్తున్న  షీ టీమ్స్
 • సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న 11 షీ టీమ్స్
 • అసభ్యంగా ప్రవర్తిస్తున్న 248 మందిని పట్టుకున్న షీటీమ్స్
 • సైబరాబాద్ పరిధిలో భారీగా కేసులు
 • మార్చి, ఏప్రిల్ నెలల్లోనే 355 ఫిర్యాదులు
 • వాట్సప్ ద్వారా ఫిర్యాదులు: 269
 • 269 కంప్లయింట్లలో 81 ఎఫ్ఐఆర్లు నమోదు
 • ఫోన్లలో వేధిస్తున్నారన్న కంప్లయింట్స్ : 141
 • పబ్లిక్ ప్లేసుల్లో మఫ్టీలో డెకాయ్ నిర్వహిస్తూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న 248 మందిని పట్టుకున్న షీటీమ్స్

హైదరాబాద్: ఒంటరిగా ఉన్నప్పుడే కాదు.. పబ్లిక్ ప్లేసుల్లో.. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు అమ్మాయిలు, మహిళలను వేధించే ఆకతాయిలకు వణుకు పుట్టిస్తున్నాయి షీ టీమ్స్. వివిధ రూపాల్లో.. రకరకాల అవగాహన కార్యక్రమాల ద్వారా.. వేధింపులు ఎదుర్కొంటున్న వారు వెంటనే ఫిర్యాదులు చేస్తుండడంతో ఆకతాయిలకు షీ టీమ్స్ తగిన రీతిలో బుద్ధి చెబుతున్నాయి. హద్దులు దాటి ప్రవర్తించిన వారికి సంకెళ్లు వేసి కటకటాల వెనక్కి పంపుతున్నారు. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 11 షీ టీమ్స్ పనిచేస్తుండగా.. ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో 355 మంది బాధితులు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. అమ్మాయిలు, మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించేందుకు షీ టీమ్స్ పబ్లిక్ ప్లేసుల్లో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ నిర్వహిస్తుండగా సినిమాలు, సీరియళ్ల తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

అభం శుభం ఎరుగని మైనర్ల మొదలు.. సెలబ్రిటీలను వదలని ఆకతాయిలు

సోషల్ మీడియా వాడకం పెరగడంతో.. చక్కగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాల్సిన యువత.. చెడుమార్గం బారినపడుతున్నట్లు అనేక ఘటనల్లో రుజువవుతోంది. పసిబుగ్గల చిన్నారులు మొదలు. 50ఏళ్ల వయసున్న మహిళలను వేధించడం.. మోసాలకు పాల్పడడం చేస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నెంబర్లు సంపాదించి.. అసభ్య మెసేజీలు పంపిస్తూ.. మార్ఫింగ్ చేసిన ఫోటోలు.. వీడియోలు పంపిస్తూ బ్లాక్ మెయిలింగుకు దిగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఫోన్లు, సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలను పరిచయం పెంచుకుని ఆ తర్వాత వేధింపులకు దిగుతున్న వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. సైబరాబాద్ పరిధిలో షీటీమ్స్ కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే నేరాలు, నేరగాళ్లు ఏవిధంగా తయారయ్యారో అర్థం అవుతుంది. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేస్తున్న కేసులో కాదు.. ఉద్యోగాలిప్పిస్తానని, కాస్త ఒంటరిగా కనిపిస్తే చాలు అసభ్యంగా ప్రవర్తించిన వారిని కూడా షీటీమ్స్ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే షీ టీమ్స్ కు వాట్సాప్ ద్వారా 269 కంప్లెయింట్స్ రాగా.. ఫోన్లో వేధింపులకు పాల్పడుతున్నారని 141 కంప్లెయింట్స్ వచ్చాయి. బాల్య వివాహాలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. షీ టీమ్స్ రంగంలోకి దిగి.. 7 బాల్య వివాహాలను అడ్డుకున్నాయి. రెండు నెలల్లో వచ్చిన 269 కంప్లెయింట్స్ లో 81 ఎఫ్ఐఆర్ లు నమోదు, మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు పోలీసులు.

హీరోయిన్ నెంబర్ తీసుకుని వేధింపులు

స్టార్ మేకర్ యాప్ ద్వారా ఓ హీరోయిన్ నెంబర్ తీసుకొన్న కేటుగాడు వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. వేధింపులను భరించలేకపోయిన నటి షీ టీమ్స్ కి కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్ పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. 

సైబరాబాద్ పరిధిలో షీ టీమ్స్ కు గత మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చిన ఫిర్యాదుల వివరాలు..

 • ఫోన్ ద్వారా వేధింపుల కేసులు:  141
 • బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులు: 34
 • సోషల్ మీడియా ద్వారా వేధింపులు: 33
 • బెదిరింపులు, భయాందోళనకు గురిచేస్తున్న కేసులు: 33
 • వెంటపడి.. వెంబడించి వేధిస్తున్న కేసులు: 35
 • పెళ్లి కోసం మాయమాటలు చెప్పి, అబద్దాలు చెప్పిన మోసగాళ్ల కేసులు: 19
 • అసభ్యంగా ప్రవర్తించి వేధించిన కేసులు: 19
 • అశ్లీల, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో వేధించిన కేసులు: 12
 • వాట్సప్ మెసేజీల ద్వారా వేధించిన కేసులు: 11
 • వెకిలి మాటలు, చేష్టల కేసులు: 7
 • అమ్మాయిలు, మహిళలను రహస్యంగా వీడియో తీసిన కేసులు: 3
 • పనిచేస్తున్న సంస్థల్లో వేధింపులకు పాల్పడిన కేసులు: 3
 • ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులు: 2
 • అశ్లీలంగా చూపిస్తూ వేధించిన కేసులు: 2
 • అసభ్యంగా, ఉద్దేశ పూర్వకంగా తాకుతూ వేధించిన కేసులు: 1

 

 

ఇవి కూడా చదవండి

వరంగల్ డిక్లరేషన్ పేరుతో సాధ్యం కాని హామీలు

సంపద అంతా కేసీఆర్ కుటుంబమే దోచుకుంది..!

హైదరాబాద్ లో ఉండొద్దు... ప్రజల్లో తిరగండి