సందీప్ కిషన్ బర్త్ డే గిఫ్ట్స్ వచ్చేశాయ్..!

సందీప్ కిషన్ బర్త్ డే గిఫ్ట్స్ వచ్చేశాయ్..!

యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా రెండు సినిమాల అప్ డేట్స్ వచ్చాయి. ప్రస్తుతం సందీప్ మైఖేల్ అనే ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. విజయ్ సేతుపతి మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ మూవీని రంజిత్ జయకొడి డైరెక్ట్ చేస్తున్నాడు.

మైఖేల్ మూవీ ఫస్ట్ లుక్ ను హీరో సందీప్ కిషన్ బర్త్ డే సంధర్బంగా శనివారం రిలీజ్ చేశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సందీప్ ఈ పోస్టర్ లో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు. అలాగే సందీప్ నటిస్తున్న మరో సినిమా ‘‘ ఊరు పేరు భైరవకొండ’’ ఫస్ట్ లుక్ రిలీజైంది. వి.ఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఈ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టిగ్ గా ఉందంటున్నారు ఫ్యాన్స్.  తన బర్త్ డే రోజు రెండు సినిమాల ఫస్ట్ లుక్ లు రావడంతో హ్యాపీ గా ఫీలవుతున్నట్లు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశాడు హీరో సందీప్ కిషన్.