ట్రిఫుల్ రైడింగ్ చేసిన కుక్క

ట్రిఫుల్ రైడింగ్ చేసిన కుక్క

కుక్కలంటే కొందరికి చాలా ఇష్టం. వాటిని కుటుంబ సభ్యులతో సమానంగా పెంచుకుంటారు. మరికొందరైతే అంతకంటే ఎక్కువగానే చూసుకుంటారు. ఎక్కడి వెళ్లినా వారి వెంటే కార్లలో,బైక్ లపై  డాగ్స్ ను కూడా తీస్కెళ్తుంటారు. అయితే ఓ కుక్క మాత్రం తానే బైక్ డ్రైవింగ్ చేస్తూ తన యజమానులను తీస్కెళ్తూ ట్రిఫుల్ రైడింగ్ చేసింది. ఈ ఘటన జరిగింది మన దేశంలో కాదు… బ్రెజిల్‌లో.

ఓ డాగ్… ఇద్దరు వ్యక్తులను వెనుక కూర్చోబెట్టుకుని బైక్ రయ్యిమంటూ దూస్కెళ్లింది. వెనక కూర్చున్న వ్యక్తులు హెల్మెట్ పెట్టుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న కుక్క మాత్రం హెల్మెట్ ధరించలేదు. గాలి వేగంగా వీస్తుంటే కుక్క అలా డ్రైవింగ్ పైనే దృష్టి పెట్టింది.  రోడ్డుపై అలా డ్రైవింగ్ చేయడాన్ని చూసిన తోటి ప్రయాణికులు ఆశ్చపోయారు. కొందరు బైక్ నడిపే వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.