
జనాలు ప్రయాణం చేయాలంటే ట్రైన్స్, బస్సులు, విమానాల ద్వారా వెళుతుంటారు. జంతువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే కంటైనర్లను కాని ట్రక్లను కాని ఉపయోగిస్తాము. కాని ముంబై లోకల్ ట్రైన్లో ప్రతి రోజు ఒక కుక్క బోరివాలి నుండి అంధేరీకి ప్రయాణిస్తుంది.
డైలీ బోరివాలి నుండి అంధేరీ
ప్రతిరోజు మన గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో లేదా లోకల్ రైలుపై ఆధారపడతాము. కానీ ఇప్పుడు జంతువులు కూడా లోకల్ ట్రైన్స్ లో ప్రయాణం చేస్తున్నాయి. ముంబయి లోకల్ ట్రైన్ లో ప్రతిరోజు ఒక కుక్క బోరివాలి నుండి అంధేరీకి ప్రయాణం చేస్తుంది. ఓ ప్రయాణికుడు ఈ వీధి కుక్క ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను 649 వేల మంది చూశారు. ఇంకా 82వేల k లైక్‌లు వచ్చాయి. ఈ డాగ్ లోకల్ ట్రైన్ ఎక్కి, రైలు కదులుతున్నప్పుడు డోర్ దగ్గర ఉంటుంది. ఈ కుక్క అద్భుతమైన ప్రయాణం ప్రజలను ఆశ్చర్యపరిచింది. అంధేరి చేరుకున్న తర్వాత, కుక్క ట్రైన్ దిగుతుంది. ప్రతిరోజూ ఈ కుక్క ఇలానే ప్రయాణం చేస్తుంది.
ఒకరు ఈ కుక్క లోకల్ ట్రైన్ లో నిత్యం ఓ ప్రయాణికుడని పోస్ట్ చేశారు. బోరే హో గయా హూన్.. తోడా ఘూమ్ కె అతా హూన్, అని మరొకరు రాశారు. ఇంకొకరు స్వేచ్ఛగా తిరగడం, ఉచిత రైలు ప్రయాణం శాంతియుతంగా చేయడం చూడటం ఇష్టమని రాశారు. ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం గాని.. చెడుగా ప్రవర్తించడం కాని చేయలేదు ఇదే తనకు నచ్చిందని అని నాల్గవ వారు పోస్ట్ పెట్టారు. ఏది మైనా రోజూ ఆ కుక్క టైం ప్రకారం లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేయడం చెప్పుకోదగ్గ విషయం.