రాజేంద్రనగర్‌లో MDMA, కొకైన్ కలకలం నైజీరియన్ లేడీ అరెస్ట్

రాజేంద్రనగర్‌లో MDMA, కొకైన్ కలకలం నైజీరియన్ లేడీ అరెస్ట్

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠా కలకలం రేపింది. సన్ సిటీని అడ్డాగా చేసుకొని గత కొంతకాలంగా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. భార్య, భర్తతో పాటు మరో ముగ్గురు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బెంగుళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తూ.. హైదరాబాద్ లో విక్రయిస్తున్న కొందరు వ్యక్తులను రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రైడ్ లో ఓ నైజీరియా మహిళను అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. నైజీరియాకు చెందిన తంబా ఫిడల్మా ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.