
ఓ వృద్దురాలికి మత్తుమందు ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, బ్యాగుతలో ఉన్న డబ్బుతో పారిపోయాడు ఓ నకిలి వైద్యుడు. ఈ ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ... ఈస్ట్ గోదావరి ప్రాంతానికి చేందిన నూకల సుజాత అనే మహిళ.. 2023 జూన్ 02న ట్రైన్ లో విజయవాడకు వెళ్తు్ండగా ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను నిమ్స్ లో సర్జన్ గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.
ఈ క్రమంలో తనకున్న పలు ఆరోగ్య సమస్యలను సుజాత అతనికి వివరించింది. అయితే తాను ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తానని ..తాను చెప్పిన ప్లేస్ కు వస్తే త్వరగా కోలుకునేలా మందులు ఇస్తానని చెప్పాడు. అతని మాటలను నమ్మిన సుజాత .. అతని నుంచి ఫోన్ రాగానే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వినాయక లాడ్జీకి వెళ్లి అతన్ని కలిసింది.
కాసేపటికి అతను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని స్పృహ కోల్పోయింది. తిరిగి మెలుకువ వచ్చి చూసేసరికి ఒంటిపై ఉన్న బంగారంతో పాటు బ్యాగ్ లో ఉండాల్సిన నగదు కనిపించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన సుజాత వెంటనే గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సీసీ వీడియోల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. అపరిచితులను నమ్మకూడదని పోలీసులు చెబుతున్నారు.