ఘనంగా కుక్కల పెళ్లి.. వైరల్ అవుతున్న వీడియో

ఘనంగా కుక్కల పెళ్లి.. వైరల్ అవుతున్న వీడియో

అన్ని పెళ్లిల్లలాగానే.. ఈ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పటిలాగానే పెళ్లి కొడుకు చిరునవ్వు నవ్వాడు. అతన్ని చూసిన పెళ్లి కూతురు సిగ్గు పడింది. భాజా భజంత్రీలు, బంధువుల సమక్షంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లి పెద్దలంతా వధూవరులను ఆశీర్వదించారు. ఇంతకీ ఎవరిదీ పెళ్లి అని ఆశ్చర్యపోతున్నారా..! రెండు కుక్కలది. అవును... ఆ పెళ్లి  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హితీందర్ సింగ్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. పెంపుడు కుక్కల్ని సొంతింటి వాళ్లలా భావించే ఓ ఫ్యామిలీ ఈ పని చేసింది. తమ ఇంటి కుక్కలకు ఘనంగా పెళ్లి జరిపించింది. పెళ్లి కూతుర్ని నగలు, పట్టు బట్టలతో ముస్తాబు చేశారు. పెళ్లి కొడుకును కారులో ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత వేద మంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిపించారు. 

ఈ పెళ్లికి వచ్చిన వాళ్లందరికీ విందు భోజనాలు కూడా వడ్డించారు. చివరగా వధువు వేషంలో ఉన్న కుక్కను డోలిలో మోసుకుంటూ అత్తగారింటికి సాగనంపారు. ఇలా అప్పగింతల కార్యక్రమంలో వివాహ తంతును ముగించారు.