
రామడుగు, వెలుగు: అద్దె ఇంటిలో ఉంటున్న ఓ ఫ్యామిలీకి కరోనా సోకడంతో ఇంటి ఓనర్ ఖాళీ చేయించాడు. ఈ ఘటన కరీంనగర్జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ పేద కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో కిరాయికి తీసుకుని ఉంటోంది. కాగా ఆ కుటుంబ సభ్యులకు కరోనా రావడంతో తమకు కూడా సోకుతుందేమనన్న భయంతో ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయించాడు. ఇలాంటి పరిస్థితిలో ఎక్కడి పోవాలని బాధపడుతుండగా గ్రామస్తులు సర్పంచ్ కర్ర
సత్యప్రసన్న దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచ్నిర్మాణంలో ఉన్న తన ఇంటిలో ఉండమని చెప్పారు. అలాగే రూ.500, ఫ్యాన్, నీటి వసతి కల్పించారు.