
దుబ్బాక, వెలుగు : బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా షాక్ కొట్టడంతో ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చంద నర్సయ్య (55) తన పొలం పక్కనున్న పెద్ద వాగు నుంచి సాగు నీటిని మళ్లించుకునేందుకు బోరు మోటార్‌ను ఫిట్ చేశాడు. అనంతరం మోటార్ స్విచ్‌ను ఆన్ చేయగా విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తొగుట పోలీసులు తెలిపారు.