అడవి పందుల కోసం వేసిన వైరు తగిలి రైతు మృతి

అడవి పందుల కోసం వేసిన వైరు తగిలి రైతు మృతి

కొడంగల్​, వెలుగు: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు, అడవిపందుల నుంచి పంటను కాపాడుకునేందుకు మరోరైతు ఏర్పాటు చేసిన కరెంట్​ కంచె తగిలి స్పాట్​లోనే మృతిచెందాడు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లా ఎనికేపల్లిలో మంగళవారం జరిగింది. ఆంజనేయులు(30) ఉదయం వరికి నీళ్లు పెట్టెందుకు పొలానికి వెళ్ళాడు. అదే గ్రామానికి చెందిన సంగెం హన్మంతు అడవి పందుల నుంచి వరి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి కరెంట్​ పెట్టాడు. ఈ క్రమంలో కరెంట్​ తీగ అంజనేయులు కాలుకు తగలడంతో అక్కడే మృతిచెందాడని కుటుంబ సభ్యలు, గ్రామస్థులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.